ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం ఎలిమినేషన్ పూర్తి అయిపోయిన సంగతి తెలిసిందే. మొదటివారం ఎలిమినేషన్ల భాగంగా బెజవాడ బెబక్క బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు చాలామంది అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి ఎంత రెమ్యూనిరేషన్ వస్తుందో అన్న విషయంపై సర్వర్త చర్చలు సాగుతున్నాయి. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన బెజవాడ బేబక్కకు బాగానే గిట్టుబాటు అయినట్లుగా కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెమ్యూనిరేషన్ సంబంధించిన విషయంలోకి వెళితే..


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. ఇందులో భాగంగా మొదటి వారంలో బెజవాడ బెబక్క బయటికి వచ్చింది. మొదటివారం నామినేషన్లలో  బెబక్కతో పాటు నాగ మణికంఠ, విష్ణుప్రియ, సోనియా, పృథ్వి, శేఖర్ భాషలు మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉండగా చివరికి బేబక్క అతి తక్కువ ఓటింగ్ శాతంతో ఎలిమినేట్ అయింది. ఈ వారం రోజులో ఆవిడ కేవలం కిచెన్ కే పరిమితం కావడంతో ఆవిడ పెద్దగా ఆకట్టుకోలేకపోయారని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో ఆమె నుంచి పెద్దగా ఎంటర్టైన్మెంట్ రాలేదు. అంతేకాకుండా కుక్కర్ గొడవతో ఆమెపై కాస్త నెగెటివిటీ కూడా ఎక్కువైంది.


ఇకపోతే ఆవిడ బయటికి రావడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇక ఆవిడ వారం రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకుగాను ఎంత సంపాదించిందని  గాలిలో లెక్కలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ గా ఆవిడ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టగా ఆవిడ ఒక్కరోజుకు 21,428 రూపాయలు చార్జి చేసినట్లుగా సమాచారం. ఈ లెక్కన ఆవిడ సుమారుగా ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల వరకు సంపాదించి ఉంటుందని టాక్. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆవిడ మొదటి వారంలోనే వెళ్ళిపోవడంతో ఆవిడ కాస్త భావోద్వేగానికి లోనయ్యింది. ఇందుకు సంబంధించి తాజాగా ఆవిడ ఓ ఎమోషనల్ వీడియోను కూడా షేర్ చేసింది. ఇందులో భాగంగా తనకి బిగ్ బాస్ తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయని కాకపోతే జర్నీ అప్పుడే అయిపోయిందని తనకి సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలవుతుందంటూ రాసుకోవచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: