టాలీవుడ్‌ స్టార్‌ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్, నాగార్జున, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా సాంప్రదాయంగా దుస్తులను ధరించి కేవలం తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.


స్నేహ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషలలో సినిమాలు చేస్తూ సినీ అభిమానులను ఆకట్టుకుంది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన స్నేహ తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొంతకాలం నుంచి స్నేహ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.


హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో కేవలం అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటిస్తోంది. అంతేకాకుండా పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. స్నేహ అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో తన అభిమానులు ఎంతగానో సంబరపడిపోయారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే స్నేహ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటుంది.


ఇదిలా ఉండగా... సోషల్ మీడియాకు స్నేహ చాలా దూరంగా ఉంటారు. ఏవో కొన్ని సందర్భాలలో తప్ప తనకు సంబంధించిన అన్ని విషయాలను పెద్దగా షేర్ చేసుకోదు. ఈ క్రమంలోనే స్నేహకు సంబంధించిన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో స్నేహ ఎంతో క్యూట్ గా, అందంగా ఉంది. అయితే ఈ ఫోటో చూసిన చాలామంది స్నేహ చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందని, ఇప్పుడు కూడా అంతే అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: