విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి  లది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్లిద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్), 'ఎఫ్ 3' భారీ విజయాలు సాధించాయి. ఆ రెండిటినీ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మూడో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఆ సినిమా విడుదల తేదీ గురించి అప్డేట్ ఇచ్చారు.  ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ, 'సంక్రాంతికి

 వస్తున్నాం' టైటిల్ ఖరారు చేశారని సమాచారం. టైటిల్ మాత్రమే కాదు... సినిమాను కూడా సంక్రాంతికి తీసుకు వస్తున్నారు. ఆ విషయాన్ని తాజాగా  విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు. ఇదిలవుండగా తాజాగా పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు. నెల రోజులకు పైగా సాగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో, లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్, సాంగ్స్ చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో, వెంకటేష్ సంప్రదాయ దుస్తులలో కళ్లద్దాలతో కనిపిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ చీరలో ట్రెడిషినల్‌గా, మీనాక్షి చౌదరి మోడరన్ అవతార్‌లో ఆకట్టుకున్నారు.

ఎక్స్ కాప్‌, అతని ఎక్స్‌లెంట్‌వైఫ్‌, ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రైయాంగిల్‌క్రైమ్ ఎంటర్‌టైనర్‌లో.. వెంకటేష్‌ వైఫ్‌గా ఐశ్వర్య రాజేష్, గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి 2025 బరిలో అగ్ర హీరోలు
ఇప్పటి వరకు సంక్రాంతి పండగ మీద కన్నేసిన సినిమాలు రెండు ఉన్నాయి. ఓ సినిమా 'విశ్వంభర'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న చిత్రమిది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: