స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ప్రస్తుతం ఈ సినిమాలోని బ్యాలెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఘాట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కనిపిస్తారట. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా

 కాకుండా ప్రస్తుతం హృతిక్ రోష‌న్‌ తో కలిసి మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’లో కూడా నటిస్తున్నాడు. ఇదిలవుండగా దేవర జోరు చూస్తుంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాక ముందే మిలియన్ డాలర్ మార్క్ అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ను ట్రైలర్ ను మంగళవారం (సెప్టెంబర్ 10) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. యూఎస్ఏ ప్రీమియర్ కు మరో 18 రోజుల సమయం ఉండగానే రికార్డు సమయంలోనే 25 వేల టికెట్లు అమ్ముడైనట్లు కూడా మేకర్స్ వెల్లడించారు.

 ఇప్పడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సేల్స్ మరింత పెరిగి రిలీజ్ సమయానికి ఎన్ని రికార్డులు బ్రేకవుతాయో చూడాలి. ఇక దేవర ట్రైలర్ రిలీజ్ గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ ముంబైలో జరగనుండగా.. ఆదివారమే తారక్ అక్కడికి వెళ్లాడు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు రాగా అన్నీ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: