సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ కూడా అక్కలాగే ఉంటుందని తెలిసిందే. పూజ కన్నన్ ఓ తమిళ సినిమాలో మెయిన్ లీడ్ లో కూడా నటించింది. ఇటీవల కొన్ని నెలల క్రితం పూజ కన్నన్ కు తను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థాన్ని గ్రాండ్ గా చేసారు. పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు ఆ సమయంలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా సైలెంట్ గా కేవలం ఫ్యామిలీ, సన్నిహితుల మధ్యే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి జరిగింది. నేడు ఉదయం పూజా కన్నన్ – వినీత్ పెళ్లి జరిగినట్టు సమాచారం. నిన్న హల్దీ ఈవెంట్ ఫొటోలు, సంగీత్ వీడియోలు వైరల్ అవ్వగా నేడు ఉదయం

 నుంచి సోషల్ మీడియాలో పూజా కన్నన్ – వినీత్ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2024 జనవరిలో పూజ కన్నన్ ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత గురువారం పూజ కన్నన్, వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. సాయి పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అన్ని తానై చెల్లి పెళ్లి ఘనంగా జరిపించింది సాయి పల్లవి. తాజగా ఈ పెళ్లి వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పెళ్లి వేడుకలో చెల్లి పూజా కన్నన్‌తో కలిసి సాయి పల్లవి డ్యాన్స్ చేసింది. మరాఠీ సాంగ్ అప్సర అలీ పాటకు,క్వీన్ సీనిమాలోని లండన్ తుమక్డా సాంగ్ కు వీళ్లిద్దరు చేసిన డ్యాన్స్ లు

 ఓ రేంజ్ లో చేశారనే చెప్పాలి. ఇక పూజకన్నన్ విషయానికి వస్తే సాయి పల్లవి లాగే హీరోయిన్ గా ఎదగాలని చిత్ర సీమలో అడుగుపెట్టింది. మొదటి సినిమాగా తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వంలో zee5 నిర్మించిన చితిరై సెవ్వానం చిత్రంలో నటించింది. తెలుగులో అనగనగా ఓక మంగళవారం గా వచ్చింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: