నిజానికి ఆరెంజ్, యాపిల్ పండ్లపైనే ఎక్కువ సందర్భాల్లో స్టిక్కర్లు కనిపిస్తుంటాయి.అయితే ఇవి వాటిని పండించిన విధానానికి, అలాగే మన ఆరోగ్యానికి సంబంధించిన సూచికాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్టిక్కర్లపై గల నెంబర్లు పండ్ల క్వాలిటిని, పండించిన తీరును తెలియజేస్తాయి. అంటే వాటిని సేంద్రియ పద్ధతిల్లో పండించారా? లేక కెమికల్స్ ఉపయోగించడం ద్వారా పండించారా? అనేది తెలుసుకోవచ్చు. కొన్ని రకాల పండ్లకు అరటించిన స్టిక్కర్లపై 4 అంకెతో ప్రారంభమైన సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు 4879 లేదా 4058 ఇలా నెంబర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే..
నాలుగు నెంబర్ తో ప్రారంభమైన స్టిక్కర్ కలిగి ఉన్నప్పుడు ఆ పండ్లు పురుగు మందులు, వివిధ రకాల రసాయనాలను పీచికారి చేయటం ద్వారా పండించారని అర్థం. అందుకే వీటిని తక్కువ ధరకు కూడా అమ్ముతుంటారు. ఇక 8 అంకెతో ప్రారంభమైన స్టిక్కర్ ఉన్న పండ్లకు అర్థం ఏమిటంటే..అవి జన్యు మార్పిడి ద్వారా పండించినవి. అంటే ఇవి సహజమైనవి కావు. సాధారణ పురుగు మందుల పిచికరీతో పండించినవి కాబట్టి రసాయనాలు పీచికారి చేసిన పండ్లు కంటే కాస్త ఎక్కువ ధర పలుకుతాయి. పండ్లు పై 9 అంకెతో ప్రారంభమైన స్టిక్కర్ ఉంటే గనుక ఆ పండ్లను పురుగు మందులు, కెమికల్స్ వంటివి ఏమాత్రం ఉపయోగించకుండా, పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం. ఉదాహరణకు యాపిల్, ఆరెంజ్ పండ్లపై 98265 వంటి నెంబర్ ఉండనుకొండి అవి సహజ సిద్ధంగా పండించినవి. కాబట్టి వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది.