అలాగే ప్రస్తుతం డాక్టర్లు కూడా తనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అంటూ ఒక పోస్ట్ ని అభిమానులతో పంచుకోవడం జరిగింది. దీంతో అభిమానులు కూడా రష్మిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మేకప్ లేని ఒక ఫోటోను సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అయితే ఈ ఫోటోకి ఒక క్యాప్స్న్ని రాసుకొస్తూ.. అవును నేను ఇక్కడ యాక్టివ్ గా ఉండలేదని పబ్లిక్ గా కనిపించడం లేదని మీకు తెలుసు.. అయితే అందుకు గల కారణం గత నెలలో తనకు ప్రమాదం జరిగిందని తెలియజేసింది.
ఈ ప్రమాదం చాలా చిన్నదని కానీ డాక్టర్లు తనని ప్రస్తుతం అయితే విశ్రాంతి తీసుకోమంటూ సలహా ఇచ్చారని తెలిపింది. ఇప్పుడు తాను మునుపటి కంటే మెరుగ్గా ఉన్నానని కొన్ని పనులు చేయడంలో కాస్త యాక్టివ్గా మారినట్లు తెలియజేస్తోంది. నేను మీకు చెప్పేది ఒకటి మీ గురించి మాత్రమే మీరు శ్రద్ధ తీసుకోవాలి.. జీవితంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము ఎందుకంటే అది చాలా అనూహ్యమైనది అంటూ తెలిపారు. అసలు రేపు ఉంటుందో లేదో అనే విషయం తెలియదు కాబట్టి ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలంటూ తెలిపింది రష్మిక. పుష్ప-2 , సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేర వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.