యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో వస్తుండటం.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. దాంతో.. ఎన్టీఆర్ అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ స్టైలిష్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో జనతా గ్యారెజ్‌ వంటి హిట్‌ సినిమా వచ్చింది. దాంతో.. మరోసారి ఈ కాంబో రిపీట్‌ అవుతుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. దేవర'. సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్‌ ముంబయి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్‌ అవుతున్నాయి.ఇకపోతే ఈ సంగతి అలా వుంచితే ఈ నెలలో రాబోతున్న దేవర సినిమా విషయంలో కూడా నిడివి మీద కసరత్తు మొదలైందని తెలుస్తోంది.దేవర కథ ఒక్క భాగంలో చెప్పడం కష్టం అని డిసైడ్ అయిన తరువాతే దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలు చేసారు.అందువల్ల నిజానికి నిడివి సమస్య రాకూడదు.

తొలిభాగాన్ని ఎక్కడ ముగించాలన్న క్లారిటీ వుండే వుంటుంది.పైగా పెద్దగా పాటలు లేవు.ఈ మధ్య వదిలిన పాటను కూడా తీసుకెళ్లి వర్కింగ్ టైటిళ్ల మీద పెట్టేసారు.అలా ఒక అయిదు నిమషాలు నిడివి తగ్గినట్లే.దేవర సినిమా ఫైనల్ కట్ నిడివి తొలిభాగం మూడు గంటల పది నిమిషాల వరకు వచ్చిందని, దీనికి రెండు గంటల యాభై నిమిషాల మేరకు తగ్గించాయిచే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.ఇది ఎంత వరకు నిజ‌మో కానీ మూడు గంటల పది నిమిషాలను రెండు గంటల యాభై నిమిషాలు చేయడం అంటే కాస్త కష్టమైన టాస్క్ అనే చెప్పాలి.కొన్ని షాట్స్ ను రెండో భాగానికి మార్చడం.కానీ అలా చేయాలంటే కథలో జంప్ లు వచ్చే ప్రమాదం వుంది.అలాంటివి వుండకుండా, నిడివి పెరగకుండా చూడడం అంటే అంత సులువైన పని కాదు.కొరటాల ఏం చేస్తారో చూడాలి మరి.ఇకపోతే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలనే ఉంచుతుంది. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ అదరగొడుతుంది. ఎన్టీఆర్ ఎనర్జీని కరెక్ట్ గా మ్యాచ్ చేయగలుగుతుంది అని కూడా చెప్పొచ్చు. అలానే అనిరుద్ అందించిన ట్యూన్స్ మొదటి కొంత మేరకు ట్రోల్స్ కు గురి అయిన కూడా ఆ తర్వాత అవి చాట్ బస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి హిట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: