* సాయం చేయడంలో పెదనాన్న కృష్ణం రాజు బాటలో ప్రభాస్ రాజు…
* కష్టం వచ్చిన ప్రతీసారి ప్రభాస్ ఆర్ధిక సాయం.. నిజమైన హీరో అంటూ ప్రశంసలు..
రెండు తెలుగు రాష్ట్రాలకు ఆకస్మిక వరదలు తీవ్ర నష్టం కలిగించాయి.. ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ లో భారీ వరదలు వచ్చాయి.. భారీ వర్షాలు ఒక కారణం అయితే ఆ వర్షానికి బుడమేరు వాగుకు గండ్లు పడి భారీ వరదకు కారణం అయింది.. దీనితో విజయవాడ నగరం మునిగిపోయింది.విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. వరద భాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేసింది.. వరద భాధితులకు ఆహరం, పాలు బిస్కెట్ లు వంటివి డ్రోన్స్ ద్వారా వెళ్లలేని చోటుకి సైతం అందేలా చేసారు.. అంతే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు బోట్ ద్వారా వరద ప్రాంతాలను పర్యటించి భాధితులకు దైర్యం చెప్పారు..ఇదిలా ఉంటే వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన భాదితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది.. అందరి కంటే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసారు.. ఎన్టీఆర్ ను చూసి టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది.