టాలీవుడ్ నటి కాజల్ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ వరుసగా సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోయింది.


మొదట మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ ఆ సమయంలోనే లక్ష్మీ కళ్యాణం అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమాలో తన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ వరుసగా అవకాశాలను అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది. కాజల్ సినిమాల విషయంలో చాలా ఆసక్తితో పనిచేసేది. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేదట.


వరుస సినిమాలతో జోరు మీద ఉన్న కాజల్ అలాంటి సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహ అనంతరం నీల్ కిచ్లు అనే మగ బిడ్డకు జన్మనిచ్చారు టాలీవుడ్ నటి కాజల్. కొన్ని రోజులపాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కాజల్ గత కొద్ది రోజుల క్రితమే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ కాజల్ కు పెద్దగా హీరోయిన్గా అవకాశాలు రావడం లేదు.


దీంతో ఈ బ్యూటీ విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.... ఓవైపు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ మరోసారి గర్భం దాల్చినట్టు ఉందని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే టాలీవుడ్ నటి కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అని వార్తలు వైరల్ కావడంతో ఆమె ఫాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ టాలీవుడ్ నటి కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అనే వార్త గతంలోనూ వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: