తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటనలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం అని మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడికి తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వచ్చాడు. 

కానీ ఈయన నటించిన సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా చాలా ఎక్కువ సినిమాలు ఫెయిల్ అయ్యాయి.  ప్రస్తుతం కిరణ్ అబ్బవరం "క" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే మేకర్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కిరణ్ అబ్బవరం కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమా యొక్క మలయాళం థియేటర్ హక్కులను మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ సంస్థ అయినటువంటి వేఫ్యారర్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఏకంగా మలయాళ స్టార్ హీరోసినిమా యొక్క మలయాళ హక్కులను దక్కించుకోవడంతో ఈ సినిమా మలయాళ ఏరియాలో భారీ ఎత్తున విడుదల అయ్యే అవకాశాలు చాలావరకు ఉన్నాయి. మరి ఈ మూవీ మలయాళ ఏరియాలో ఏ రేంజ్ సక్సెస్ను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: