టాలీవుడ్ యువ నటుడు సుహాస్ హీరోగా జనక అయితే గనక అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు అనగా సెప్టెంబర్ 6 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను కూడా కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించనున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా విడుదల చేశారు. ఇక ఈ మూవీ విడుదలకు అంతా సిద్ధం అనుకున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా భారీగా వర్షాలు కురవడం , దానితో రెండు రాష్ట్రాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం  రాష్ట్రంలో పరిస్థితులు బాగో ఈ సినిమా విడుదలను ఆపివేశారు. 

ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని అక్టోబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇకపోతే అక్టోబర్ 11 వ తేదీన తమిళ నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా రూపొందిన వేట్టాయన్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇక సూపర్ స్టార్ రజినీ కాంత్ లాంటి స్టార్ హీరో సినిమాకు పోటీగా సుహాస్ సినిమాను దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు.

మరి రజనీ కాంత్ సినిమాకు పోటీగా నిలబడి ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేయగలదా అని చాలా మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే , మంచి టాక్ వస్తే రజనీ కాంత్ సినిమాకు పోటీగా నిలబడి కూడా సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేయగలరు అందుకే దిల్ రాజు ఈ తేదీని ఎంచుకున్నాడు. సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకే ఈ రోజుల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి అని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి జనక అయితే గనక సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: