-సినిమాలు చూడడానికే అభిమానులా.?
- వారి సాయం తీసుకోవడానికి పనికిరారా.?
- ఈ రియల్ హీరోలు రియల్ హీరోలు ఎప్పుడవుతారో.?


సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మరి ఆ హీరోలు ఏమైనా రాళ్లు కొట్టి, మట్టి మోసి, దుక్కి దున్ని, పొలం పండించి అన్ని కోట్లు సంపాదిస్తున్నారా..కాదు కదా..అభిమాని ఆదరిస్తేనే ఆ హీరో అంతటి స్థాయికి ఎదగలిగాడు. పేద ప్రజలు సినిమాలు చూస్తేనే ఆ హీరో ఆ రేంజ్ కి వెళ్తున్నాడు. కోట్లు వెనకేసుకొని, ఖరీదైన కార్లలో, విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. తన మనవళ్లు, ముని మనవళ్లు తిన్న తరగతి ఆస్తులు సంపాదించుకొని వెనకేసుకుంటున్నారు. ఇలా ప్రజల నుంచి సంపాదించుకున్న సొమ్ములో కనీసం 10 పైసలు కూడా ప్రజల కోసం ఖర్చు చేయడంలో వేనకాడేవారు ఎంతో మంది ఉన్నారు. అభిమాని ఆపత్కాలంలో ఉంటే ఆయనకు కనిపించదా..అభిమాని వరదల్లో చిక్కుకుంటే ఆదమరిచి నిద్రిస్తాడా.? సినిమా ప్లెక్సీ కట్టడానికి అభిమాని కావాలి, ప్రమోషన్స్ లో అభిమాని కావాలి. హీరో ను హైలెట్ చేయడానికి అభిమాని కావాలి. కానీ అభిమానికి ఆపద వస్తే ఆ హీరో కనీసం తన ఇంటి గడప దాటడు.. అలా ఇండస్ట్రీలో హీరోలుగా ఉండి సాయం అందించడంలో జీరో అయినటువంటి కొంతమంది హీరోల గురించి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. హీరోలు ఎంత సంపాదించిన కనీసం సాయం చేయడం లేదని ప్రజలనుకుంటున్నారు.

 కోట్లున్నా సాయం సున్నా.!

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వారిని ఆదరించిన ప్రజల ద్వారా కోట్లాది రూపాయల సంపాదించుకున్నారు. సినిమాల్లో మాత్రమే వారు హీరోలుగా కనిపిస్తారు, తప్ప బయట జీరోలని నిరూపించుకుంటున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరదల వల్ల ఎంతోమంది ప్రజలు అతలాకుతలమయ్యారు.  వందలాదిమంది ప్రజలు మరణించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎంతోమంది ఇండ్లను కోల్పోయారు. చివరికి వరదల దాటికి ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అనేక ఇక్కట్లు పడుతున్నారు.  అంతేకాదు కొంతమందిని తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసి అందులో ఉంచారు.  ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల కోసం మనం ఎంతో సాయం అందించాలి. ఇందులో ముఖ్యంగా హీరోలు ఎక్కువ సాయం అందించాలి. కానీ  కొంతమంది హీరోలు మాత్రమే ఎక్కడ ఆపత్కాలమున్న ముందుగా స్పందిస్తున్నారు.


ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఎక్కడ పేద ప్రజలకు ఆపద వచ్చిన ముందుగా సాయం అందిస్తారు. ఇక వీరు తప్ప ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు,  హీరోయిన్లు  ఉన్నారు. వారు ఎంతో సంపాదిస్తున్నారు.  కనీసం దాంట్లో 10% పేద ప్రజల కోసం ఖర్చు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రవితేజ, శ్రీకాంత్, రాజశేఖర్, విజయ్ దేవరకొండ, నితిన్, హీరో రామ్, కాజల్ అగర్వాల్, త్రిష, అనుష్క, రష్మిక మందన, ఇలా ఎంతోమంది హీరో, హీరోయిన్లు  ఇండస్ట్రీ ద్వారా తెలుగు ప్రజల ద్వారా ఎంతో పేరు తెచ్చుకొని కోట్లాది రూపాయలు సంపాదించారు. కానీ సాయం అందించడంలో మాత్రం  వెనుకబడి పోతున్నారని కొంతమంది ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: