మంచు విష్ణు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు విష్ణు రీసెంట్గా కన్నప్ప మూవీ షూటింగ్లో ఫుల్ బిజీ అయిపోయారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రిమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తరికెక్కుతున్న తాజా చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్వహిస్తున్నాడు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రాబోతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీ డిసెంబర్ లో థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ క్రమంలో..మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రతి సోమవారం ఓ క్యారెక్టర్ రిలీజ్ చేస్తూ కన్నప్ప మూవీ పై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మధుబాల, దేవరాజ్, సంపత్ రామ్, శరత్ కుమార్, అవ్రామ్ నటీనటుల పోస్టర్లు విడుదలయ్యాయి. తాజాగా, కూడా కన్నప్ప మేకర్స్ నేడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టినరోజు కావటంతో 'కన్నప్ప' నుంచి ఆయనకు సంబంధించిన క్యారెక్టర్ ను రివిల్ చేశారు.

అంతేకాకుండా ఓ పోస్టర్ ను కూడా ట్విట్టర్ వేదికగా మంచు విష్ణు షేర్ చేయటంతో అంచనాలు డబల్ అయ్యాయి. పోస్టర్లో చేతికి రుద్రాక్ష మా ధరించిన ఫోటోను రిలీజ్ చేయటంతో ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అయితే ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో..కన్నప్ప టీం అక్షయ్ కుమార్ పోస్టర్ విడుదల చేయటంతో డార్లింగ్ ఫాన్స్ షాక్ అవుతున్నారు. మరి ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేస్తున్నాడో రీవిల్ చెయ్యాలని నెట్టింట పోస్ట్ లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: