తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే ఈ మధ్య కాలంలో మంచి విజయాలను అందుకుంటూ కెరియర్ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నారు. ఇక వరుస విజయాలతో కెరియర్ను సూపర్ గా ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన పోయిన సంవత్సరం ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించి రెండింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు.

నేను పోయిన సంవత్సరం దసరా , హయ్ నాన్న మూవీ లతో విజయాలను అందుకోగా , ఈ సంవత్సరం సరిపోదా శనివారం మూవీ తో ప్రేక్షకులను పలకరించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే సరిపోదా శనివారం సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఇక 11వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటి వరకు విడుదల అయిన మీడియం రేంజ్ తెలుగు మూవీలలో 11 వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేసిన సినిమాలు లిస్ట్ లో సరిపోదా శనివారం 4 వ స్థానంలో నిలిచింది.

ఇక మొదటి స్థానంలో 3.34 కోట్ల కలెక్షన్లతో హనుమాన్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమా 2.21 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , జాతి రత్నాలు మూవీ 2.5 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక నాలుగవ స్థానంలో నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా 1.95 కోట్ల కలెక్షన్లతో నిలిచింది. ఇలా ఈ సినిమా విడుదల అయిన నాలుగవ రోజు విషయంలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: