తమిళ ప్రముఖ హీరో జయం రవి భార్య ఆర్తితో విడాకులు తీసుకోవడం ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారిపోయింది.అయితే మా విడాకుల్లో ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయకండి అని, ఇది మా వ్యక్తిగతమని రవి చెప్పారు. కానీ సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా.. వీరి మధ్య ఎడబాటుకి కారణమేంటి.. విడాకులు తీసుకోవడానికి అసలు గొడవ ఏంటి అని చాలామంది దీన్ని వెతికే పనిలో పడ్డారు. అయితే తాజాగా కోలీవుడ్ లో ఒక వార్త వినిపిస్తోంది. అదేంటంటే జయం రవి ఆర్తి ల పచ్చని కాపురంలో ఓ హీరో చిచ్చుపెట్టారు అంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది.ఇక ఆ హీరో ఎవరంటే..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..గత కొద్ది రోజులుగా ధనుష్ తో ఆర్తి స్నేహాన్ని మెయింటైన్ చేస్తుందట.

ఇక ధనుష్ పెట్టే ప్రతి పార్టీకి ఆర్తి వెళ్లడంతో ఈ విషయంలో జయం రవి కాస్త కోపంగా ఆర్తిని మందలించారట.కానీ ఆర్తి వినిపించుకోలేదట.ఇక ఆ మధ్యకాలంలో ధనుష్ తో ఆర్తి క్లోజ్ గా తిరుగుతోందని జయం రవి ధనుష్ తో గొడవ పెట్టుకున్నారట కూడా.అంతేకాదు ఆ గొడవకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతూ జయం రవి ఆర్తిల విడాకులకు అసలు కారణం ధనుషే నని,ధనుష్ వల్లే ఈ జంట విడిపోయింది అని పుకార్లు సృష్టిస్తున్నారు.
 
అయితే తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు కానీ గతంలో మాత్రం ధనుష్, జయం రవి,ఆర్తి, త్రిష నలుగురు ఓకే ప్లేస్ లో ఉండి ధనుష్ ఆర్తి లు ఇద్దరు ఏదో విషయం గురించి ఆర్గ్యూ చేసుకున్న ఫొటోస్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఓ స్టార్ హీరో విడాకులు తీసుకున్నారంటే ఆ హీరో విడాకుల్లో ఎన్నో రూమర్లు పుట్టుకు వస్తాయి. అలా జయం రవి విడాకుల్లో కూడా ధనుష్ పేరు హైలెట్ గా నిలుస్తుంది.మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: