యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం జనతా గ్యారేజ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఎన్టీఆర్ అభిమానులు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో దేవర అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ , మరో వైపు కొరటాల శివ ఇద్దరు కూడా అద్భుతమైన ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. అది ఇలా అనుకుంటున్నారా ..? ఈ సినిమాకు సంబంధించిన పనులన్నింటిని పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్సినిమా ప్రచారాలను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం ముంబై లో ఉన్న ఎన్టీఆర్ అక్కడి నుండి ప్రచారాలను పెద్ద ఎత్తున చేయనున్నట్లు తెలుస్తోంది. అలా ఈ మూవీ యొక్క ప్రచారాలను ముంబై నుండి భారీ ఎత్తున స్టార్ట్ చేసినట్లు సమాచారం.

ఇక కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన అవుట్ ఫుట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అందులో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దానితో కొరటాల శివ ప్రచారాలకు దూరంగా ఉన్న ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చేందుకు పని చేస్తున్నట్లు , ఇక ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాను జనాల్లోకి అద్భుతంగా తీసుకెళ్లేందుకు ప్రచారాలను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ ఓ రకంగా , కొరటాల మరో రకంగా ఈ సినిమా గురించి పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: