ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంవాయిదాలు పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.అల్లు అర్జున్సుకుమార్సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఆ నటనకే జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప 2 కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప- 2లోనూ ఐటెమ్ సాంగ్ ఉండనుందని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే తొలి పార్ట్ స్పెషల్ సాంగ్లో స్పెప్పులేసిన సమంతనే సీక్వెల్లోనూ ఆడిపాడనుందని టాక్ వినిపించింది. కానీ, సమంత ఈ సాంగ్ చేయట్లేదని క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత మేకర్స్ బాలీవుడ్ బ్యాటీలు దీశా పటానీ, జాన్వీ కపూర్ను సంప్రదించినట్లు టాక్ నడిచింది. వాళ్లు కూడా నో చెప్పారని సమాచారం. కానీ, ఈ విషయంపై ఓ కొలిక్కి రాలేదు. అయితే ఈ సస్పెన్స్కు డైరెక్టర్ సుకుమార్ తాజాగా చెక్ పెట్టారంట. ఐటెమ్ సాంగ్లో స్పెప్పులేయనున్న హీరోయిన్ను కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?పుష్ప ది రూల్'లో ఐటెమ్ సాంగ్లో ఎవరు కనిపించనున్నరన్న సస్పెన్స్ వీడినట్లే! ఈ పాటకోసం మూవీ మేకర్స్ బాలీవుడ్ బ్యాటీ 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రిని సంప్రదించారట. ఆమె నుంచి కూడా పాటిజివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో స్పెషల్ సాంగ్లో బన్నితో కలిసి, త్రిప్తి చిందులేయడం దాదాపు ఖాయమైనట్లే.త్రిప్తి దిమ్రీని ఈ పాటలో సిజ్ చేయడానికి దాదాపు ఖరారు చేసారని సామాచారం. వార్తల ప్రకారం చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.అధికారిక ధృవీకరణ ఇంకా జరగనప్పటికీ, ఈ వార్త నెమ్మదిగా వైరల్ అవుతోంది. చిత్ర నిర్మాతలు రెండు పాటలను విడుదల చేయగా, ఈ సాంగ్స్ కి అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, పుష్ప రాజ్ కథలోని తదుపరి అధ్యాయాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా రోజులు లెక్కిస్తున్నారు.ఇదిలావుండగాఅనిమల్ సినిమాలో కూడా నేషనల్ క్రష్ రాష్మిక.. కొత్త నేషనల్ క్రష్ త్రిప్తి కనిపించారు. ఇపుడు అదే కాంబో మళ్ళీ స్క్రీన్ పైన కనపడబోతుంది. ఇద్దరు నేషనల్ క్రష్ లు అల్లు అర్జున్ తో ఉంటే థియేటర్లో పునకాలే అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: