ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన ఈజీగా 300 కోట్ల వరకు కలక్షన్లను ఆ సినిమా వసూలు చేస్తుంది. దీనితోనే అర్థం అవుతుంది ప్రభాస్ స్టార్ స్టామినా ఏంటి అనేది. దానితో ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అదిరిపోయే రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇక ప్రభాస్ కి ఓ రికార్డు విషయంలో ఎవరు దరి దాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు.

అసలు విషయం లోకి వెళితే ... సౌత్ ఇండస్ట్రీ కి సంబంధించిన చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే తమ సినిమాలతో 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో సౌత్ హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా , తమిళ నటుడు తలపతి విజయ్ రెండవ స్థానంలోనూ , సూపర్ స్టార్ రజనీ కాంత్ మూడవ స్థానం లోనూ నిలిచారు. ఇకపోతే వీరు ఎన్ని సినిమాలతో 300 కోట్ల కనెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టారు అనే వివరాలను తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించగా అందులో ఏకంగా 6 సినిమాలో 300 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టాడు.

దానితో సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక సార్లు 300 కోట్ల కలెక్షన్లను అందుకున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత తలపతి విజయ్ 4 సినిమాలతో 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలోనూ , సూపర్ స్టార్ రజనీ కాంత్ 2 సార్లు 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 3 వ స్థానంలోనూ నిలిచాడు  ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు 300 కోట్ల కనెక్షన్లను అందుకున్న హీరోల లిస్టులో ప్రభాస్ మొట్ట మొదటి స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: