వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే 1986 లో వరదలు వచ్చిన సమయంలోను తెలుగు ఇండస్ట్రీ ఇలానే స్పందించింది. అప్పుడు వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరిగి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి లోతట్టు, లంక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరదలు ముంచెత్తడతంతో 250 మందికి పైగా మరణించారు. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయిలయ్యారు. రైల్వే ట్రాకులు కట్టుకుపోయాయంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ కదిలి పెద్ద సంఖ్యలో విరాళాన్ని అందించింది. అప్పట్లో సినీ హీరోలు అందించిన విరాళాల లిస్టును ఒకసారి పరిశీలిద్దాం. సూపర్ స్టార్ కృష్ణ లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. కృష్ణ రాజు 1.05 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ 2.50 లక్షల రూపాయలు విరాళంగా అందించారట. దాసరి నారాయణ రావు గారు రూ. లక్ష రూపాయలు విరాళంగా అందించారు. రామానాయుడు గారు ర.50 వేలు విరాళంగా వరద బాధితులకు అందించారు. మెగాస్టార్ చిరంజీవి 50 వేలు రూపాయలు అందించారట. అక్కినేని నాగేశ్వరరావు గారు 25 వేలు విరాళంగా అందించారు. అశ్వినీదత్ గారు రూ.10 వేలు అందించారట. విక్రమ్ యూనిట్ తరపున రెండున్నర లక్షలు అందించారట. ఇక ఇలా ఎవరికీ తోచిన సహాయం వాళ్లు చేశారట.