విశ్వంభర’.. ఖైదీ నెంబర్ 150 తర్వాత, మళ్లీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు మేకర్స్. ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట.మూడు దశాబ్దాల కిందట వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోకి సుందరి’ సినిమాకు అప్పటి ఆడియెన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో.. ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఒళ్లు జలదరించే వీఎఫ్ఎక్స్ ఇందులో కనిపించనున్నాయట. దాని కోసం హాలీవుడ్ టెక్నీషీయిన్లను పనిచేస్తున్నారు.ఇదిలావుంటే ప్రస్తుతం సినిమాలకు థియేట్రికల్‌ హక్కుల బిజినెస్‌తో సమానంగా జరుగుతుంది ఓటీటీ వ్యాపారం. ఓ సినిమా నిర్మాణంలో ఖర్చుపెట్టిన వ్యయంలో దాదాపు అరవై శాతం పైగా ఓటీటీ హక్కుల రూపంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇది ఆ సినిమాలో నటీనటులు, దర్శకుడు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిన్న సినిమాల ఓటీటీ హక్కులు తీసుకోవడంలో కాస్త బెట్టు చేసినా ఓటీటీ సంస్థలు ముఖ్యంగా అగ్రతారలు నటించే సినిమాల హక్కులు కొనడంలో పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు అగ్రతారల విషయంలో కూడా హక్కులను కొనే ధర విషయంలో ఓటీటీ సంస్థలు అచితూచి అడుగులేస్తున్నాయట.

ఇప్పుడు విశ్వంభర ఓటీటీ హక్కుల విషయంలో నిర్మాతలు కోట్‌ చేసిన అమౌంట్‌ను ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమా నిర్మాణ వ్యయం పెరగడంతో విశ్వంభర హక్కుల కోసం పోటీపడుతున్న ఓటీటీ సంస్థలకు నిర్మాతలు అత్యధిక అమౌంట్‌ను కోట్‌ చేశారు.అయితే నిర్మాతలు ఆశిస్తున్న దానిలో సగం ధరకే ఓటీటీ సంస్థలు విశ్వంభర హక్కులు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఓటీటీ సంస్థలు ఇచ్చినా ఆఫర్‌ చూసి నిర్మాతలు మా సినిమాను ఇంత తక్కువకు అడగడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఓటీటీ హక్కుల కోసం పోటీ పడిన సంస్థలు ఇప్పుడు కాస్త స్పీడును తగ్గిస్తూ.. ఓటీటీ రైట్స్‌ విషయంలో అచితూచి వెళ్లడమే అందుకు కారణమని తెలుస్తోంది..సరైన డీల్ వచ్చే వరకు ఓటీటీ బిజినెస్ ని క్లోజ్ చేయరు నిర్మాతలు.ఓటీటీ బిజినెస్ అయ్యే వరకు థియేట్రికల్ రిలీజ్ ఉండదు, అంటే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. మరి ఏమి జరగబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, ‘నా సామి రంగ’ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే సురభి, ఇషా చావ్లా వంటి వారు ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెళ్లుగా నటించబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏంఏం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత రిచెస్ట్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. త్వరలోనే టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: