నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్లో సింహ అనే టైటిల్ తో వచ్చే అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. మరి ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమా టైటిల్స్ లో సింహ అని వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సింహం నవ్వింది అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ 1987 వ సంవత్సరంలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 1994 వ సంవత్సరం బొబ్బిలి సింహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మీనా , రోజా హీరోయిన్లుగా నటించగా ... కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 1999 వ సంవత్సరంలో సమరసింహా రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ , సంఘవి , అంజలి జావేరి హీరోయిన్లుగా నటించగా ... బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 2001 వ సంవత్సరం నరసింహ నాయుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 2002 వ సంవత్సరం సీమ సింహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

2004 వ సంవత్సరం బాలకృష్ణ లక్ష్మీనరసింహ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

2010 లో బాలకృష్ణ సింహ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

2018 వ సంవత్సరం బాలకృష్ణ జై సింహ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

2023 వ సంవత్సరం బాలకృష్ణ వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: