ఒక ఊర్లో పెద్ద వయసు ఉన్న వ్యక్తి తనకంటే చాలా చిన్న యువతిని వివాహం చేసుకుంటారు.. కానీ ఆ వ్యక్తికి మగ పిల్లవాడు కావాలని ఒక కోరిక కూడా ఉంటుంది. అయితే ఆ కోరిక తీరకముందే ఆ ముసలి వ్యక్తి మరణిస్తాడు.. ఇక ఆ ముసలి వ్యక్తి భార్య మాత్రం కుంతీదేవి లాగా తనకు కూడా ఒక మగ బిడ్డను ప్రసాదించమంటూ భీమేశ్వరుడిని కోరుకుంటుంది. ఆ తర్వాత దేవుడు కూడా తధాస్తు అని చెప్పడంతో ఆమెకు మగ బిడ్డ జన్మిస్తారు. కానీ భర్త లేకుండా బిడ్డ కలగడం అంటే ఆ గ్రామంలో చాలామంది ఎగతాళి చేస్తూ ఉండేవారు భీమని..
ఇలా ఒకరోజు భీమని తన తల్లిని తండ్రి ఎవరు అని నిలదీయగా ఈ విషయం భీమేశ్వరుడిని వెళ్లి అడగమని ఆ తల్లి చెబుతుంది. ఆ వెంటనే భీమేశ్వరుని సన్నిధికి వెళ్లి తానకి ఇప్పుడు నిజం చెప్పకపోతే కచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక శపదాన్ని చేస్తారట.. అయితే వెంటనే దేవుడు ప్రత్యక్షమై తాను నువ్వు ఒక వర ప్రసాదివి అని చెప్పి వెళ్ళిపోతారు. తనకు ఒక వరాన్ని కూడా ప్రస్తాదిస్తాడు.. (అదేమిటంటే తాను ఏది అంటే అది జరుగుతుంది).. ఇలా ఒకరోజు గ్రామంలో భోజనాలు పెడుతున్నారని భీమని అక్కడికి వెళ్ళగా అక్కడ తనని అవమానించారు. దీంతో ఆ అవమానం భరించలేక భీమని ఇలా శపిస్తారు అన్నమంతా సున్నం కావాలని తనని చూసిన నవ్విన వారందరిని కప్పలు కావాలని శపిస్తారు. అన్నట్టుగానే అక్కడ ఉన్న వారందరూ కూడా అలా మారిపోవడంతో అప్పటినుంచి బీమని గౌరవిస్తారు.
దీంతో దేశమంతటా పర్యటించిన భీమ ఆ పర్యటనలో భాగంగా కళింగ గంగరాజుని కలిసినప్పుడు ఆరాజు తనని అవమానించారని భీమకవి ఒక శాపం కూడా పెడతాడు.. ఈ శాపాన్ని ఉపసంహరించుకోవడమే ఈ సినిమా స్టోరీ అయితే ఇందులో రాజుగా ఎన్టీఆర్ నటించారు. ఇందులో ఎన్టీఆర్, షావుకారు జానకి, రాజనాల, విజయలలిత ,బాలకృష్ణ తదితరులు నటించారు. అయితే సినిమా సక్సెస్ కాలేదు కానీ.. తన కుమారుడిని ప్రమోట్ చేయడానికి ఈ సినిమా తీశారట. ఒకవేళ ఎన్టీఆర్ భీమకవి గాని నటించి ఉంటే సక్సెస్ అయ్యే వారిని చెప్పవచ్చు. ఈ సినిమా యూట్యూబ్లో కూడ లేదట. కేవలం టీవీలో వస్తేనే ఎప్పుడైనా చూడాల్సి ఉంటుంది. కొడుకు కోసమే సీనియర్ ఎన్టీఆర్ ఇలా ఒక మెట్టు దిగి మరీ నటించారు.