తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు అందరూ పెద్దగా స్టార్‌‌లు కాదు. దీంతో బిగ్ బాస్ సీజన్ చప్పగా సాగిపోతుందని అంతా భావించారు. అయితే ఉన్న కంటెస్టెంట్లు అందరిలో శేఖర్ బాషా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. అతడు వేసే జోకులకు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో సహా ప్రేక్షకులు సైతం పిచ్చెక్కిపోతున్నారు. జోకులలో అర్థం కాని లాజిక్ తెలుసుకుని పగలబడి మరీ నవ్వుతున్నారు. గతంలో భారీగా రెమ్యూనరేషన్లను ఇచ్చి వివిధ రంగాల్లో స్టార్లను పెట్టుకున్నారు. అయితే కేవలం టీఆర్పీ రేటింగ్ బాగుండాలనే ఉద్దేశంతో కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని మాత్రమే ప్రస్తుతం తీసుకున్నారు. దీంతో తొలి వారం బిగ్ బాస్ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించినంత రెస్పాన్స్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం సంతోషంగా ఉన్నారు. ఇక ప్రస్తుత సీజన్‌లో నిన్న మొన్నటి వరకు శేఖర్ బాషా పేరు తెలియదు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను కూడా అతడు బాగా అలరిస్తున్నాడు.

ప్రతి బిగ్ బాస్ సీజన్‌లో ఖచ్చితంగా ఒకరు బాగా ఎంటర్‌టైన్ చేసే వారు ఉంటారు. అలాంటి వారు లేకుంటే ఖచ్చితంగా ఆ సీజన్ ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. సినిమాలలోనూ హాస్యనటులను సైతం అందుకే పెడుతుంటారు. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు సైతం దీనిని బాగా వంటబట్టించుకున్నారు. ఇదే కోవలో ప్రతి సీజన్‌లోనూ తమదైన మాటలతో నవ్వించే కంటెస్టెంట్ ఒకరిని ఖచ్చితంగా పెడుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఆ పాత్రను ఆర్జే శేఖర్ బాషా పోషిస్తు‌న్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు బాగా మెచ్చిన కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ బాషా మారారు. తనదైన జోకులతో అందరినీ అలరిస్తున్నారు. బెజవాడ బేబక్క ఆమె లేటుగా చేస్తుందని ఆమ్లెట్ చేస్తున్నట్లు అంతా భావించారని శేఖర్ బాషా అన్నాడు. ఒక్క క్షణం ఆగిన తర్వాత అతడి జోకు అర్ధమైన నాగార్జునతో సహా పగలబడి నవ్వారు.


 ఆర్జే శేఖర్ బాషా ఇటీవలే బాగా పాపులర్ అయ్యాడు. హీరో రాజ్ తరుణ్ - లావణ్య గొడవలో అతడి పేరు బాగా పాపులర్ అయింది. రాజ్‌తరుణ్‌కు మద్దతుగా టీవీ ఛానళ్లలో మాట్లాడాడు. ఆ సమయంలో లావణ్య అతడిని చెప్పుతో కొట్టింది. దీంతో శేఖర్ బాషా సోషల్ మీడియాలో మార్మోగిపోయాడు. అతడికి ఉన్న పేరును ఉపయోగించుకునేందుకు బిగ్ బాస్ అతడిని హౌస్‌లోకి తీసుకుంది. ఇక తన తోటి కంటెస్టెంట్లతో ఎక్కువ మంది సెప్టెంబర్ నెలలోనే ఎందుకు పుడతారో తెలుసా అని శేఖర్ బాషా అడిగాడు. తల్లి కడుపులో బిడ్డలు 9 నెలలే ఉంటారని అన్నాడు. అందరూ 9వ నెలలో పుడతారని, అది సెప్టెంబర్ నెల అని డీకోడ్ చేసుకున్నాక అతడి జోక్ అందరికీ అర్ధమైంది. దీంతో ఇతర కంటెస్టెంట్లు అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: