టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ప్రథమ స్థానంలో ఉంటాడు అని చెప్పడంలో ఏ మాత్రం వినకాడాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ సాదించడంతో ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రాజమౌళి ఏదైనా నిర్మాత దగ్గర నుండి అడ్వాన్స్ తీసుకున్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే అతనితో కచ్చితంగా సినిమా చేస్తాడు అని ఏదో కారణం చెప్పి ఆయనను పక్కకు తప్పించడు అనే ఒక గొప్ప పేరు కూడా రాజమౌళికి ఉంది.

ఇకపోతే రాజమౌళి కొంత కాలం క్రితం డి వి వి దానయ్య బ్యానర్లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తాజాగా డివివి దానయ్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దానయ్య మాట్లాడుతూ ... రాజమౌళి ఒక గొప్ప వ్యక్తి. ఆయనకు ఒక్క సారి అడ్వాన్స్ ఇచ్చాము అంటే దానిని ఆయనే గుర్తు పెట్టుకుని ఏదో ఒక సారి మనకు సినిమా చేస్తాడు.

అంతే గాని అడ్వాన్స్ ఇచ్చిన దాన్ని ఏదో రకంగా వెనక్కు ఇచ్చేసి సినిమాను తప్పించుకోవాలి అనుకోడు. నేను ఆయనకు దాదాపు 2006 వ సంవత్సరం అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తర్వాత సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే సినిమా చేసేటప్పుడు నన్ను అడిగాడు. ఆ సినిమా చేస్తారా అని. కానీ నేను రాజమౌళి తో నేను మీతో పెద్ద సినిమా చేస్తాను ... సార్ ఇది ఎవరితో నైనా చేయండి అని అన్నాను. దానితో ఆయన ఎవరో ఒక నిర్మాతతో ఆ సినిమా చేశాడు. నాతో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ సినిమా చేశాడు అని దానయ్య తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: