తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరు ఓ వైపు చిరంజీవి కి మరో వైపు బాలయ్య కు ఇద్దరికి కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో సమరసింహా రెడ్డి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. దానితో ఈ సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇందుస్టీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , బి గోపాల్ కాంబినేషన్లో నరసింహ నాయుడు అనే మూవీ రూపొందింది. ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర మూవీ రూపొందింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కూడా టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇలా తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన బి గోపాల్ ఇటు బాలకృష్ణ తో 2 ఇండస్ట్రీ హిట్ మూవీలను తెరకెక్కించగా , చిరంజీవితో ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ ని రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: