తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగినటువంటి నాని సినిమాలో హీరోగా నటించి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికే నిర్మాతగా కూడా అనేక సినిమాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నాడు . ఇక పోతే నాని బ్యానర్లో రూపొందిన సినిమాల ద్వారా దర్శకుడి గా కెరియర్ను ప్రారంభించిన వారిలో శైలేష్ కోలను ఒకరు . నాని బ్యానర్లో రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ద్వారా శైలేష్ కొలను దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో శైలేష్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత శిలేగ్ ఇదే మూవీ ని ఇదే టైటిల్ తో హిందీ లో రీమిక్ చేశాడు.

కాకపోతే ఈ సినిమాను నాని నిర్మించలేదు. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈ దర్శకుడు మల్లి నాని బ్యానర్లో అడవి శేషు హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ మధ్య విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత శైలేష్ వేరే బ్యానర్లో వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్గా సైంధవ్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే మళ్లీ ఈ సారి నాని హీరోగా మరియు నిర్మాతగా రూపొందబోయే హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటివరకు నాని నిర్మించిన సినిమాలతో మాత్రమే విజయాలను అందుకున్న శైలేష్ ఈ సారి ఏకంగా నాని నిర్మించిన సినిమాతో పాటు నటించే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ దర్శకుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: