హీరో రాజ్ తరుణ్ లావణ్యల కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారంలో మాల్వి మల్హోత్రా, శేఖర్ భాష, మస్తాన్ సాయి, చింటూ ఇలా ఎంతోమంది బయటికి వచ్చారు.. ఇక రీసెంట్ గా  పోలీసులు రాజ్ తరుణ్ నిందితుడు అని తేల్చి చెప్పారు. లావణ్యతో 11సంవత్సరాలు సహజనం చేసింది నిజమేనని తేల్చేశారు. దాంతో లావణ్య నిజమే గెలిచింది అని చెప్పింది. అంతేకాదు మేమిద్దరం నిజంగానే పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మూడో వ్యక్తికి కూడా తెలియదు. అందుకే ఫోటోలు కూడా లేవు అంటూ షాకింగ్ విషయాలు బయట పెట్టింది. అంతే కాదు పోలీసులు లావణ్య రాజ్ తరుణ్ ల కేసులో రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేర్చిన వెంటనే లావణ్య తన తండ్రిని తీసుకొని రాజ్ తరుణ్ ఎక్కడున్నాడో వెతుకులాడగా చివరికి ముంబైలోని మాల్వి మల్హోత్రా ఫ్లాట్లో ఉన్నాడని వీడియోతో సహా బయటపడింది. దీంతో లావణ్య అక్కడికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా లావణ్య మరొక ట్విస్ట్ ఇచ్చింది.

 అదేంటంటే రాజ్ తరుణ్ బీరువాలోని నగలన్నింటిని దొంగలించాడంటూ లావణ్య షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై కేసు కూడా పెట్టింది. రాజ్ తరుణ్ బీరువాలోని తాళం తీసి అందులో ఉండే నా తాళి, పుస్తెలతాడు మిగిలిన నగలు అన్ని ఎత్తుకెళ్లాడు. రాజ్ తరుణ్  నా నగలన్నింటిని తీసుకెళ్లాడు. ఆధారాలతోనే ఈ విషయాన్ని బయట పెట్టాను. నగలు దాచిన బీరువా తాళం చెవి రాజ్ తరుణ్ దగ్గరే ఉంది.ఆయనే ఆ గోల్డ్ మొత్తాన్ని దొంగలించాడు. గోల్డ్ షాప్ లోని బిల్స్ కూడా ఉన్నాయి. నిన్న సాయంత్రం 6 గంటలకు బీరువా ఓపెన్ చేసి చూడగా అందులో  మొత్తం ఖాళీ ఉంది.ఒక నగ కూడా కనిపించలేదు. నా పుస్తెలతాడు నాలుగు తులాల వరకు ఉంటుంది. అది రాజ్ తరుణే చేయించారు.

దాంతోపాటు మిగిలిన నగలు కూడా లేవు.అవి రాజ్ దొంగలించారు. నా దగ్గర నుండి రాజ్ ని లాక్కుంది.ఆయన కట్టిన పుస్తెల తాడు ని కూడా ఎత్తుకు రమ్మని చెప్పిందా..  ఇంకా నన్నేం చేస్తుంది..జైలుకు పంపిస్తుందా లేక చంపేస్తుందా అంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేయడంతో వీరి కేసు మరో మలుపుకు తీరిగింది.దీంతో రాజ్ తరుణ్ లావణ్య బంగారం నిజంగానే దొంగలించాడా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేయబోతున్నారు. మరి నిజంగానే రాజ్ తరుణ్ లావణ్య బంగారం దొంగతనం చేశాడా.. లావణ్య రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొద్ది సమయం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: