తెలుగు సినీ ప్రశ్నలు అత్యంత క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు . ఈమె కెరియర్ను ప్రారంభించిన మొదటి నుండి మంచి విజయాలను అందుకుంటు వెళ్ళింది . దానితో చాలా తక్కువ కాలంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడంతో చాలా సంవత్సరాల పాటు తమన్నా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ అయిన తమన్నా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తోంది. అలాగే సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో నటించడం మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే ఒక విషయంలో మాత్రం తమన్నా చాలా మంది తన తోటి హీరోయిన్ల కంటే ముందుంది. అది ఎందులో అనుకుంటున్నారా ..? స్పెషల్ సాంగ్స్ విషయంలో. తమన్నా ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. తమన్నా తన తోటి హీరోయిన్లతో పోలిస్తే అద్భుతమైన డాన్సర్ కావడం వల్ల ఈమెకు ఎక్కువ శాతం ఐటెం సాంగ్ లలో అవకాశాలు దక్కుతున్నాయి.

ఈమె కూడా అవకాశం దక్కిన ప్రతి సినిమాలోని స్పెషల్ సాంగ్లో కూడా తన డాన్స్ తో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండడంతో ఈమె కి అనేక సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయి. దానితో ఇప్పటికే ఈ నటి అనేక సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించింది. దానితో ఈమె తన తోటి హీరోయిన్లతో పోలిస్తే స్పెషల్ సాంగ్స్ విషయంలో అత్యంత జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: