సౌత్‌లో సూపర్ హిట్ సినిమాలు తీసిన‌ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గత కొంతకాలంగా వెనుకబడ్డారు. వరుస ఫ్లాపులతో డీలా పడిన ఆయన తాజాగా బంఫ‌ర్ ఆఫ‌ర్ ద‌క్కించుకున్నారు. అగ్రహీరోతో సినిమా చాన్స్ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిట్ కొట్టాలని కసితో ఉన్నారు డైరెక్టర్ మురుగదాస్. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. రంజాన్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాజిద్ నదివాలా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇదిలావుండగా హిందీ సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీకి క్వీన్ ఆఫ్ మాసెస్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ రెడీ అయ్యారని ముంబై టాక్. ఆవిడ హిందీ సినిమా చేసే ఆల్మోస్ట్ 8 ఏళ్లు అవుతోంది. సౌత్ సినిమాలు డబ్బింగ్ అయ్యి నార్త్ ఇండియాకు వెళ్లడం తప్ప... బాలీవుడ్ కంటే టాలీవుడ్, కోలీవుడ్ అవకాశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కాజల్హిందీ సినిమాకు సంతకం చేశారని, బాలీవుడ్ బడా హీరోతో నటించే అవకాశం అందుకున్నారని టాక్.
ఇందులో కీలకమైన పాత్ర చేసే అవకాశం కాజల్ సొంతం చేసుకున్నారట. మురుగదాస్ దర్శకత్వం వహించిన దళపతి విజయ్ 'తుపాకీ'లో కాజల్ అగర్వాల్ నటించారు. అందులో ఆవిడ మెయిన్ హీరోయిన్. అయితే... ఈసారి మురుగదాస్ సినిమాలో కీ రోల్ చేసే అవకాశం వచ్చిందని బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. అది నిజమైతే... సల్మాన్ ఖాన్, కాజల్ కాంబినేషన్ కుదరడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.కాజల్ కీ రోల్ చేస్తే... మరి మెయిన్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ సినిమా 'సికిందర్'లో అసలు హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఆవిడకూ సల్మాన్ ఖాన్ తో ఇదే తొలి సినిమా. తమ సినిమాలో రష్మిక నటిస్తున్న విషయాన్ని 'సికందర్' టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. కానీ, కాజల్ విషయం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.సికిందర్' సినిమాను నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అసలు, ఈ సినిమా ప్రకటన రంజాన్ రోజు వచ్చింది.రంజాన్ పండక్కి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. వచ్చే ఏడాది 'సికిందర్' ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: