దీంతో మళ్లీ ఎమర్జెన్ సినిమా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైలోని బాంద్రాలో తన లగ్జరీ హౌస్ని సైతం రూ.30 కోట్లకు పైగా విక్రయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్ లో చాలా వైరల్ గా మారుతున్నది. 2017 లో రూ .20 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పుడు అమ్మేయడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.3,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 565 చదరపు అడుగుల ఖాళీ స్థలం కలిగి ఉన్నది. ఈ భవనాన్ని తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇందుకోసం రూ 2 కోట్ల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టడమే కాకుండా రూ .30 వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా కంగనా ప్రకటించలేం లేదు. కానీ ఇంటి స్థలం మొదటి నుంచి కూడా వివాదంలో ఉన్నది. ఈ భవనం 2020 మున్సిపల్ కార్పొరేషన్ కొంత భాగాన్ని కూల్చారట. ఈ ఇంటిని అక్రమంగా నిర్మిస్తున్నారనే విధంగా ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే కంగనా రనౌత్ ఈ ఇంటిని కూల్చడం వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని విధంగా ఈమె ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమాపై సిక్కుల సంఘం కూడా చాలా వ్యతిరేకత చూపిస్తోందట. మరి ఇన్ని ఇబ్బందులు నడుమ కంగనా ఈ సినిమాని రిలీజ్ చేస్తుందేమో చూడాలి.