కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జీవితంలో ఏం జరుగుతుందో అస్సలు అర్థం అవ్వడం లేదు. ఓవైపు ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తాను అని ఆయన పార్టీకి సంబంధించిన జెండాని కూడా అనౌన్స్ చేశారు.కానీ సడన్గా ఆయన జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా విజయ్ కొడుకు దర్శకుడిగా లైకా సంస్థ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.ఇక విజయ్ కొడుకు డైరెక్షన్లో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది..అయితే విజయ్ కి కొడుకు డైరెక్టర్ అవ్వడం అస్సలు ఇష్టం లేదట.కానీ గత కొద్ది రోజులుగా విజయ్ భార్య పిల్లలకు మంచి సంబంధాలు లేవు.. కొద్దిరోజుల నుండి విజయ్ కి భార్య ఇద్దరు పిల్లలు దూరంగా ఉంటున్నారు.

దీంతో విజయ్ భార్య సంగీత పట్టుబట్టి మరీ భర్తకు ఇష్టం లేదని తెలిసినా కూడా తన కొడుకుని డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. అయితే విజయ్ ఫ్యామిలీలో ఈ గొడవలన్నింటికీ కారణం ఓ ఇద్దరి హీరోయిన్లు అని కోలీవుడ్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే విజయ్ కాపురంలో చిచ్చు ఏర్పడిందని, వారి వల్లే వీరి జీవితం ఎటు పోతుందో తెలియడం లేదని తెలుస్తోంది. అంతేకాదు విజయ్ ఇలా ప్రవర్తించడానికి ఆయన మేనేజరే కారణమని తెలుసుకున్న విజయ్ కొడుకు విజయ్ మేనేజర్ పై ఓ రోజు దాడికి కూడా దిగాడట..అప్పటినుండి వీరి ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయని టాక్ .

అంతేకాదు విజయ్ భార్య సంగీత కూడా విజయ్ కి వ్యతిరేకంగా తన కొడుకుని తయారు చేస్తున్నట్టు కోలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్.ఇక మరొక విచిత్రం ఏమిటంటే.. రీసెంట్ గా విజయ్ హీరోగా వచ్చిన ది గోట్ మూవీలో కూడా కొడుకు తప్పుడు మాటలు విని ఎలా చెడిపోతాడు.. విలన్ గా ఎలా మారతాడు అనే స్టోరీ కూడా విజయ్ కావాలనే ప్రిపేర్ చేసుకున్నారని కోలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్.ఏది ఏమైనప్పటికీ విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న వేళ ఆయనకు వ్యతిరేకంగా భార్యా పిల్లలు ఉండడం ఒకరకంగా విజయ్ కి ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: