టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎవరికీ అందనంత వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్య కాలంలో అయితే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇలా రవితేజ ఇటీవలే 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేశాడు.ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని సిన్సియర్ ఆఫీసర్ నేపథ్యంతో ఈ సినిమా కమర్షియల్‌గా రూపొందింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. దీంతో ఆరంభంలోనే అనుకున్న విధంగా వసూళ్లు దక్కలేదు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో వారంలోనే ఈ సినిమా రన్‌ను ముగించుకుని డిజాస్టర్‌ అయింది.ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రవితేజ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో నాలుగు కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చేసాడు, అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రెండు కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చాడు. ఈ సినిమానే కాదు, రవితేజ కెరీర్ లో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టిన మరో సినిమా కూడా ఉంది. అప్పట్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ బ్యానర్ లో ‘కిక్ 2’ అనే చిత్రం తెరకెక్కింది. ఇదిలావుండగా రవితేజ నటించిన కిక్-2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు కల్యాణ్ రామ్. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో బాగానే చేతులు కాల్చుకున్నాడు. 

సినిమా లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. కల్యాణ్ రామ్ కు నష్టాలు మిగిల్చింది.గతంలో సురేందర్ రెడ్డి , రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ‘కిక్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాకి కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 2015 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇందులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరో క్యారక్టర్ ని చాలా చక్కగా రాసుకున్నాడు, ఫస్ట్ హాఫ్ ని కూడా బాగా తీసాడు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కథ పూర్తిగా గాడి తప్పింది. దీంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 42 కోట్ల రూపాయలకు జరగగా, బాక్స్ ఆఫీస్ రన్ కనీసం 17 కోట్ల రూపాయలకు కూడా చేరలేదు. దీంతో నిర్మాత కళ్యాణ్ రామ్ బయ్యర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఇచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో ఆయన తన విలువైన ఆస్తిని కూడా కొంతకాలం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో కేవలం ‘అతనొక్కడే’ చిత్రం మాత్రమే అప్పటి వరకు సూపర్ హిట్ గా ఉండేది. ఆ తర్వాత ఆ బ్యానర్ కి సరైన హిట్స్ లేవు. అన్ని సినిమాలు నష్టాలే తెచ్చి పెట్టాయి, కిక్ 2 చిత్రం ఇంకా ఎక్కువ నష్టాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా తెచ్చిన నష్టాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ కి చాలా సమయమే పట్టింది. ఎన్టీఆర్ తో తీసిన ‘జై లవ కుశ’ చిత్రంతో కళ్యాణ్ రామ్ తాను తాకట్టు పెట్టిన విలువైన ఆస్తులను వెనక్కి తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: