తనూజ్ వీర్వాణి తన మాజీ ప్రియురాలు అక్షరా హాసన్ గురించి మాట్లాడుతూ, తన మాజీ ప్రియురాలందరితో స్నేహంగా ఉంటానని, వారికి, తనకు మధ్య గౌరవం ఉంటుందని చెప్పాడు. అయితే, అక్షరా విషయంలో మాత్రం అలాంటి బంధం లేదని, ఎందుకంటే అక్షరా విషయంలో నేను గౌరవం కోల్పోయినట్లు అనిపించింద"ని చెప్పాడు. తన పార్టనర్ కి అవసరమైన సమయంలో సపోర్టుగా నిలబడాలి, కానీ ఆమె నిలబడలేదు. ఆమెను క్షమిస్తా కానీ ఆమె చేసినది నేను మర్చిపోను. అందుకే స్నేహితులుగా ఉండలేకపోయామని తెలిపాడు. "లీకైన ప్రైవేట్ పిక్స్ కారణంగా నేను ఆమెకు బ్రేకప్ చెప్పానని కొందరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఆ పిక్స్ నేనే లీక్ చేశానని అక్షరా భావించింది. ఆ తర్వాత మా మధ్య దూరం మరింత పెరిగిపోయింది." అని తనూజ్ తెలిపాడు.
తనూజ్ ఇంకా మాట్లాడుతూ తన భార్య తాన్య జేకబ్ అక్షరా హాసన్‌తో ఉన్న నా రిలేషన్ గురించి తెలిసినప్పుడు చాలా ఆందోళన చెందింది. తాన్య ఆ విషయం గురించి అడిగింది" అని చెప్పాడు. అక్షరా హాసన్‌తో ప్రేమ నడిచిన సమయంలోనే తాన్యను కలిసానని, ఆ సమయంలో తాము స్నేహితులు మాత్రమే అని తనూజ్ చెప్పాడు. ఆ సమయంలో, బహుశా ఆసక్తితో లేదా ఆందోళనతో, తాన్య ఆ విషయం గురించి తనను అడిగిందని చెప్పాడు. తనూజ్ తనకు తెలిసిన నిజం అంతా తాన్యకు చెప్పానని తెలిపాడు.