అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర బాల్చి తన్నేసింది. విజయ్ అభిమానులను మినహా.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు అందరినీ గోట్స్ (గొర్రెలను) చేసింది ఈ సినిమా. విజయ్ సినిమాలు కొన్ని దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అయితే గోట్ పై వస్తున్న విమర్శలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి అని చెప్పాలి. హీరో విజయ్ నేరుగా రాజకీయాల్లోకి దూకుతున్న తరుణంలో ఇలాంటి సినిమాలు రావడం కరెక్ట్ కాదని స్వయంగా అతడిఅభిమానులు బాధపడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా వస్తున్న విమర్శలపై గోట్ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. సినిమా క్లైమాక్స్ లో చెన్నైలో సూపర్ కింగ్స్ ను టచ్ చేశాడు. దర్శకుడు. వెంకట్ ప్రభు అలా చేయటం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కావటం లేదన్న వితండవాదన ఆయన తెరమీదకు తెచ్చారు.
రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు, ముంబై ఇండియన్స్ అభిమానులు ఈ సినిమాను విమర్శిస్తున్నారని ... సినిమా పరాజయానికి అదే కారణం అని ఆయన ఓ పసలేని వాదన తెరమీదకు తెచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను సినిమాలో ప్రేక్షకుల కోరుకునే అన్ని అంశాలు దట్టించానని పూర్తిగా ఆడియన్స్ కోసం ఈ సినిమా తీసాను తప్ప సమీక్షకుల కోసం కానే కాదని వెంకట్ ప్రభు వాదిస్తున్నాడు. అందరిని మెప్పించే సినిమా తీయాలంటే తనకు చాలా టైం పడుతుందని .. తనకు తక్కువ సమయం మాత్రమే దొరికిందని వెంకట్ ప్రభు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న గోట్ సినిమా డిజాస్టర్ అని అందరూ తేల్చేశారు.