టాలీవుడ్ లో స్టార్ హీరోలు మాత్రమే కాదు.. మిడిల్ రేంజ్ హీరోలు కూడా భారీ రెమ్యూనరేషన్‌లు తీసుకుంటున్నారు. సినిమా ప్లాప్ అయితే హీరోలు.. నిర్మాతల, బయ్యర్లను అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు ప్లాప్ సినిమాల నష్టాలను భరించేలా టాలీవుడ్ సంచలన‌ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. లాభాలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు నష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను బలి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇకపై అలాంటి విమర్శలు వినిపించకూడదని టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారట.


త్వరలో పరిశ్రమలో చర్చించి ప్రతి స్టార్ ఆ నిర్ణయాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సినిమా అంటే సక్సెస్, ప్లాప్ రెండు ఉంటాయి. నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్టు.. విజయం, పరాజయం అత్యంత సహజం. అయితే సినిమా సూపర్ హిట్ అయినప్పుడు అందరికీ సంబరమే. నటీనటులతో పాటు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అందరూ ఫుల్ ఖుషి గా ఉంటారు. అదే సినిమా ప్లాప్ అయితే నష్టం అంతా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే భరించాల్సి వస్తుంది. ఈ కారణంతోనే చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇలా ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని టాలీవుడ్ ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.


సినిమా సూపర్ హిట్ అయితే ఎంజాయ్ చేస్తున్న నటీనటులు ఇకపై ప్లాప్ అయితే తమ రెమ్యూనరేషన్‌లో సగం తిరిగి నిర్మాతలకు ఇవ్వాలని సరికొత్త ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో డిస్టిబ్యూటర్లను ఆదుకోవటానికి నిర్మాతలు బాధ్యతలు తీసుకోవాలని కండిషన్లు కూడా పెడుతున్నారట. ఇలా చేస్తే నష్టం వచ్చిన అందరూ భరించడంతోపాటు.. నిర్మాత .. డిస్ట్రిబ్యూటర్లు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుకోవడం కుదురుతుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమాకు రవితేజ రూ.4 కోట్లు, హరీశంకర్ రూ.2 కోట్లు నగదు తో పాటు తర్వాతి సినిమాకు రూ.4 కోట్లు అడ్వాన్స్ తగ్గించుకునేలాగా.. మొత్తం రూ.6 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేశారు. దీంతో ఈ ప్రతిపాదనపై టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలో నిర్మాతల మండలిలో చర్చించి దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: