ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర సినిమా ట్రైలర్ రానే వచ్చేసింది.. ఈ సినిమాపై ఇప్పటికి ఒక రేంజ్ లో అభిమానుల ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు..RRR సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో దేవర సినిమా పైన కూడా భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తూ ఉన్నది. అలాగే సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈనెల 27వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ ,ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేయగా మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా తెగ నచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ మాస్ లుక్ లో యాక్షన్స్ సన్నీవేశాలలో అదరగొట్టేసారని కూడా చెప్పవచ్చు.. కొరటాల శివ మరొకసారి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అనిరుద్ అదరగొట్టేశారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ద్విపత్రాభినయంలో నటిస్తూ ఉన్నట్లుగా చూపించారు.


ప్రకాష్ రాజ్ , షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ వంటి వారు కీలకమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు .పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ట్రైలర్ విషయానికి  సముద్రం ఒడ్డున జీవిస్తున్న కొంతమంది మనుషుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ పైన చెప్పే డైలాగులు కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఎన్టీఆర్ ని ఇందులో దేవరగా కొలుస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ వాడిన భాష కూడా ఇందులో చాలా స్టైలిష్ గా యాసగా కనిపిస్తోంది. దేవర ట్రైలర్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మొత్తానికి ట్రైలర్తో ఊపు ఊపేస్తున్నారు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: