వినాయక చవితికి వినాయకుడిని రకరకాలు బొమ్మలు పెడుతూ ఉంటారు. మరి ఇలాంటి బొమ్మని మీరు ఎప్పుడన్నా చూశారా. పుష్ప క్యారెక్టర్ లో వినాయకుడిని పెట్టారు. ఇక ఇది చూడటానికి చాలా వింతగా అనిపించినా ఇదే నిజం. అల్లు అర్జున్ రష్మిక డాన్స్ చేస్తున్న ఫోటోను వినాయకుడి విగ్రహంగా పెట్టారు. అల్లు అర్జున్ మాస్ లుక్ లో ఉన్న వినాయకుడిని కూడా పెట్టారు. ప్రస్తుతం దేశమంతా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. గ తేడాది అలాగే ఈసారి కూడా కొన్నిచోట్ల వెరైటీ వినాయకులు నిలబెట్టారు. ఇప్పుడు ఇవి నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప 2, దేవర, హనుమాన్, సలార్..

ఇలా మూవీ హీరోల .రూపాలతో ఉన్న గణేశుడు అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే విడుదలైన కల్కి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. ఈసారి ఇదే థీమ్ తో తమిళనాడులో అశ్వత్థామ విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. అలాగే సలార్ మూవీలో ప్రభాస్ విగ్రహం కూడా తయారు చేశారు. అనంతపురంలో సలార్ గణేశుడిని నిలబెట్టి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.

భక్తులు ఈ విగ్రహం చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రీసెంట్గా పుష్ప నుంచి కపుల్ సాంగ్ వచ్చిన సంగతి మనకి తెలిసిందే. అచ్చం అలాగే వినాయక విగ్రహం తయారు చేశారు..ఇది అన్నింటి కంటే చాలా వెరైటీగా ఉంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన హనుమాన్ మూవీలో హీరోగా తేజ సజ్జా నటించాడు. ఈ సినిమాలో హనుమంతుడి గెటప్ లో ఉన్న గణేషుడిగా  భక్తులకు దర్శనమిచ్చాడు. టీమిండియా క్రికెట్ జట్టు టి20 వరల్డ్ కప్ ను గెల్చుచుకుంది. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ వినాయకుడు బొమ్మలని చూడటానికి జనాలు తరలి వస్తున్నారు. ఇక ఈ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఇలా రకరకాల సినిమాలో పున్న వినాయకుడిని విగ్రహాలు పెట్టారు. ఇక పుష్ప 2 విగ్రహం అయితే చాలా వెరైటీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: