మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బాహుబలి సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ముందుగా తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తమన్నా, ఇప్పుడు హిందీ సినిమాల్లోనూ బాగానే రాణిస్తుంది. తాజాగా వచ్చిన ‘స్త్రీ 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలోని ‘ఆజ్ కి రాత్’ అనే పాటలో తమన్నా చేసిన డాన్స్ అంతా యువతను ఫిదా చేస్తోంది. ఈ పాటతో తమన్నా మరోసారి ప్రేక్షకులను అలరించింది.

తమన్నా తాజాగా మీడియాతో మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడింది. ముఖ్యంగా, ఆమె విజయ్ వర్మతో పిల్లలు కనాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తాను పిల్లలను ఎలా పెంచాలో తెలియక చాలా భయపడుతున్నానని చెప్పింది. ఒక బిడ్డకు కావాల్సినంత ప్రేమ, శ్రద్ధ, పోషణ ఇవ్వగలనా అనే అనుమానం తన మనసులో ఉందని చెప్పింది. తన తల్లిదండ్రులు తనను చాలా గారాబంగా పెంచడం వల్ల, తానూ అలాగే పిల్లలను పెంచగలనా అనే భయం తనలో ఉందని కూడా చెప్పింది.

ఈ మిల్కీ బ్యూటీ ఇంకా మాట్లాడుతూ, "చాలా మంది లవర్స్, భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలు ఫేస్ చేస్తారు. ఈ సమస్యలు మొదట్లోనే కనిపించినా, వాటిని సరిచేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి, అలాగే అవి కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే, మనం ఆ సమస్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాము. ఆ సమస్యలు పెద్దగా మారిపోతాయి. రిలేషన్‌షిప్‌ను డ్యామేజ్ చేస్తాయి. అందుకే, సంబంధాలు బాగా ఉండాలంటే, చిన్న చిన్న సమస్యలను మొదట్లోనే సరిచేసుకోవడం చాలా ముఖ్యం." అని చెప్పింది. విజయ్ వర్మ కంటే ముందు తాను ఇద్దరినీ లవ్ చేశానని అవి రెండు ఫెయిల్ అయ్యాయని కూడా తెలిపింది. ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే, ఆమె త్వరలోనే ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా, ఆమె చేతిలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: