ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి మల్టీస్టారర్ తర్వాత ఇప్పుడు సోలో హీరోగా వస్తున్నాడు. ఆయన దేవర సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన మూవీ ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్‌ సినిమా వచ్చి మంచి ఆదరణ పొందింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నారు.ఈ సినిమా విజయం ఇటు కొరటాలకి, అటు ఎన్టీఆర్‌ చాలా ముఖ్యం. కొరటాల గత చిత్రం ఆచార్య దారుణంగా డిజప్పాయింట్‌ చేసింది. దీంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విమర్శలకు సమాధానం చెప్పాలి, తాను పుంజుకోవాలి. కాబట్టి ఈ మూవీ హిట్‌ ఆయనకు చాలా ముఖ్యం.మరోవైపు ఎన్టీఆర్‌కి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్‌. ఆయన చివరగా సోలో హీరోగా అరవింద సమేత చిత్రంలో నటించారు. ఇది బాగానే ఆడింది. కానీ బ్లాక్‌ బస్టర్‌ కాదు. ఆ తర్వాత వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ కావడంతో, పైగా అది రాజమౌళి సినిమా కావడంతో ఆ క్రెడిట్‌ అంతా ఆయనే తీసుకెళ్లారు.దీనికితోడు ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తుంది. ప్రభాస్‌, బన్నీ, చరణ్‌, మహేష్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాను కూడా ఆ లీగ్‌లో ఉండాలంటే దేవర కచ్చితంగా పెద్ద హిట్‌ కావాల్సిందే.

తాజాగా దేవర ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ ఆకట్టుకుంది. కానీ సినిమా కథేంటో ట్రైలర్‌లో చెప్పేశాడు దర్శకుడు. ఇదే అసలు క అయితే అది రొటీన్‌గానే ఉందనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కథ ఇదే అయితే సినిమా కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ కామెంట్స్ మరింత ఆందోళనకి గురి చేస్తున్నాయి.మంగళవారం ముంబయిలో ట్రైలర్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో తారక్‌ మాట్లాడుతూ, ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్నా అని, చాలా నర్వస్‌గా ఉందని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో చివరగా వచ్చాను. అందులో రామ్‌ చరణ్‌ మరో హీరో. ఇప్పుడు సోలో హీరోగా దేవర సినిమా చేస్తున్నా. ఆరేళ్ల తర్వాత సోలోగా నా మూవీ వస్తుందంటే కాస్త నర్వస్‌గా ఉందని చెప్పారు ఎన్టీఆర్‌.ముంబైలో ఈవెంట్ జరగడం సంతోషంగా ఉందన్నారు. త్రిబుల్ ఆర్ కు ప్రమోషన్ సమయంలో నార్త్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. దేవర విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.దేవర చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ నెల 27న పాన్‌ ఇండియారేంజ్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్‌ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: