తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు.అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ ఐతే ఒక రేంజ్ లో ఉన్నాయి.ఇదిలావుండగా దేవర ట్రైలర్ పై లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. "సముద్రం అతడి పాదక్రాంతం. సమయం అతడి ఆయుధాహస్తం.భయో ద్విగ్నం అతడి ప్రవేశం. ఈ సాయంత్రం మొదలు దేశం దేవర కైవసం" అని మూవీ ట్రైలర్ పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ అంచనాలు పెంచేసాయి.ఇలా హైప్ పెంచేస్తే పోతాం శాస్త్రి గారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అయితే జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. ఆమె లుక్స్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీ మధ్య వచ్చే సన్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అనిరుద్ రవిచందర్ అద్భుతమైన సంగీతంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అనేలా ఉంది. ట్రైలర్‌లో కొన్ని సీన్స్ అయితే కళ్లకువిందుగా ఉన్నాయి. ట్రైలర్ చివరలో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంది. ఓవరాల్‌గా అయితే.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం.. సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: