జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా ట్రైలర్ నిన్నటి రోజున గ్రాండ్గా ముంబైలో రిలీజ్ కాక.. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దేవర సినిమా పైన ఎక్కువగా నెగటివ్నే స్ప్రెడ్ చేస్తున్నారు ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్. చాలామంది కూడా ఎన్టీఆర్ మీద మిమ్స్ చేస్తూ రియాక్షన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పించిన డైలాగులు ఒక రేంజ్ లో ఉన్న కథ ఆసక్తిగా లేదంటే చాలామంది తెలియజేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ కొరటాల శివ గతంలో తెరకెక్కించిన కొన్ని సినిమాల పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.


చివరిగా కొరటాల శివ చేసిన ఆచార్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇందులో కనిపిస్తున్నాయని అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాల సినిమాలోని సన్నివేశాలు అదుర్స్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ చూపించిన తీరు ఎన్టీఆర్ను చూపించిన తీరు చాలా డిఫరెంట్ గా ఉందని.. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పెద్దగా అట్రాక్షన్ అయ్యారా కనిపించడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


దీంతో దేవర సినిమాలో కొత్తగా ఏముంది అనే విధంగా అనుమానాలను తెరలేపేలా కొంతమంది కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. వీటికి తోడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా హీరోకు క్లాప్ వస్తుందని ఆ అనుమానం కూడా నిజమయ్యేలా ఉందంటూ చాలామంది నెగిటివ్ గానే దేవర సినిమా పైన కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమా విజువల్స్ పరంగా చూస్తే అదిరిపోయాయని కొన్ని యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేసారని తెలుస్తోంది. సంగీతం అనిరుద్ అదరగొట్టేసారని.. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో తండ్రి, కొడుకులు గా కనిపించబోతున్నారు. మరి ఇలాంటి విషయాలు అన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఈనెల 27వ తేదీ వరకు ఆకాల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: