యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఎన్టీఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ స్థాయి సినిమాలోని నటించాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కాస్త ఎక్కువ సమయం తీసుకుని తాజాగా దేవర అనే సినిమాను పూర్తి చేశాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ కి సంబంధించిన ట్రైలర్ను కూడా తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా దానికి ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టాడు. అందులో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ వస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తాజాగా పాత్రికేయలతో ముచ్చటించాడు. అందులో భాగంగా దేవర మూవీ గురించి అద్భుతమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ... దేవర మూవీ అద్భుతమైన విజయం సాధిస్తుంది.

సినిమా ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలోని ఆఖరి 40 నిమిషాలు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఆ 40 నిమిషాల సినిమాను ఎప్పుడు జనాలతో కలిసి చూస్తానని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక ఎన్టీఆర్సినిమా ఆఖరి 40 నిమిషాల గురించి అంత గొప్పగా చెప్పడంతో ఆ ఆఖరి 40 నిమిషాలు ఏ స్థాయిలో ఉంటుందో అని చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: