సౌతిండియన్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేశ్ తన స్వశక్తితో సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. "వడ చెన్నై" సినిమాతో ఐశ్వర్య కెరీర్‌ మలుపు తిరిగింది. "ది గ్రేట్ ఇండియన్ కిచెన్", "క పే రణసింగం" వంటి సినిమాలతో కూడా మెప్పించింది. ఈమెకు సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదని కాదు. ఉంది, కానీ అది ఉపయోగపడని బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. 'మల్లెమొగ్గలు' హీరో రాజేశ్ ఆ తరం ప్రేక్షకులకు తెలిసే ఉంటాడు. ఐశ్వర్య ఆయనకు స్వయానా కూతురు అవుతుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది. సినిమాల్లో వీరికి ఎంతో కొంత పేరు ఉంది కానీ ఐశ్వర్య కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది. ఐశ్వర్య పొట్టకూటి కోసం చిన్న చిన్న పనులు కూడా చేయాల్సిన దుస్థితి వచ్చింది.

దానికి ఒక కారణం ఉందని ఐశ్వర్య రాజేశ్ తల్లి నాగమణి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె మాట్లాడుతూ "రాజేశ్ సినిమాల్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో కావడానికి పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా రాలేదు. జంధ్యాల సినిమాల్లో రాజేశ్ ఎక్కువగా నటించారు. అవి మంచి విజయాలను సాధించాయి. రాజేశ్ కి ఫ్రెండ్స్. వాళ్లు ఏం చెప్పినా వెంటనే నమ్మేసేవారు. అలాంటి మాటలు నమ్మే 'అలజడి' సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. మరో నిర్మాత కూడా హ్యాండ్ ఇచ్చాడు. దాని ఫలితంగా రాజేష్ కి బాగా నష్టాలు వచ్చాయి. ఎంతగా అంటే అప్పటిదాక కష్టపడి ఎర్న్ చేసిన మొత్తం మనీ ఆవిరైపోయింది. దానివల్ల ఎంతో బాధపడ్డారు. ఆ తరువాత పచ్చకామెర్లు వచ్చాయి. మానసిక అనారోగ్య సమస్యలను ఆయన భరించలేక కన్నుమూశారు." అని చెప్పింది.

"తండ్రి చనిపోయే నాటికి ఐశ్వర్య రాజేశ్ కి కేవలం ఎనిమిదేళ్ల వయసు మాత్రమే ఉందని ఆమె వెల్లడించింది. ఎప్పుడూ సినిమాలు చేయాలని తన బిడ్డ అనుకోలేదని పేర్కొంది. బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించే సెటిల్ అయిపోవాలని ఐశ్వర్య భావించిందట. కానీ అనుకోకుండానే అవకాశాలు రావడంతో సినిమాలనే కెరీర్ గా సెలెక్ట్ చేసుకుంది. తెలుగులో టక్ జగదీష్ కారణంగా ఆమెకు ఒక ఫ్లాప్ వచ్చింది. దాని తర్వాత అవకాశాలు రాలేదు కానీ తమిళ మలయాళం లో మాత్రం ఐదారు సినిమాలు తో ప్రస్తుతం బిజీగా ఉంది. తన కూతురు సహజంగా మేకప్ లేకుండా నటించడమే ఆమెకు మంచి ప్లేస్ అయిందని ఐశ్వర్య తల్లి నాగమణి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: