రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అనగా సెప్టెంబర్ 8వ తేదీన సాయంత్రం 5:04 నిమిషాలకు దేవర ట్రైలర్ విడుదల చేశారు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత భిన్నాభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.  ముఖ్యంగా నెటిజన్స్ ఈ ట్రైలర్ పై కొంతమంది నుంచీ పాజిటివ్ గా రివ్యూ వస్తే , మరికొంతమంది నెగిటివ్గా రివ్యూ ఇవ్వడమే కాకుండా కొన్ని ఎన్టీఆర్ సినిమాలనే ఇందులో మిక్స్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దేవర ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించకపోవడానికి గల ఐదు కారణాలు ఇప్పుడు చూద్దాం.

హై వోల్టేజ్ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ నెగెటివిటీని ఎక్కువగా మూట కట్టుకుంటుందని చెప్పవచ్చు.. మరోవైపు అత్యంత వేగంగా 100 K లైక్స్ సాధించిన ట్రైలర్స్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇది కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే మెప్పించింది. మిగతా వారిని విప్పించలేదు అని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర ట్రైలర్ ఫాస్ట్గా జనాలలోకి వెళ్లలేదు. అందుకే టాప్ టెన్ లో తొమ్మిదవ స్థానం లో నిలిచింది. అంటే అసలు జనాలలోకి ఈ ట్రైలర్ వెళ్లలేదనే చెప్పాలి.

అయితే ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ పై ప్రజలు ఎందుకు అంత ఆసక్తి చూపించలేదు అనే విషయాన్నికొస్తే..

•ఇప్పటికే నందమూరి అభిమానులకు ,నందమూరి ఫ్యామిలీకి అలాగే టిడిపికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీనికి కారణం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ చాలామంది ఎన్టీఆర్ ను విమర్శిస్తున్నారు. పార్టీ ఉంటుందా? పోతుందా? అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలవకుండా ఎన్టీఆర్ దూరం పెట్టడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ను  దూరం పెడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాకపోవడానికి కూడా కారణం ఇది ఒకటి.


•మరొకవైపు బాలయ్య వారసుడి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం చేశారు. అంతేకాదు సెప్టెంబర్ ఆరవ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మొదటి సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హడావిడి చేస్తున్నారు.

•మరొకవైపు వైసీపీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాడనే చర్చ తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈయన సన్నిహితుడు కొడాలి నాని వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆయన టిడిపిని విమర్శించినా కూడా ఏ రోజు కొడాలి నాని మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు ఎన్టీఆర్. దీంతో టిడిపి అభిమానులు, ఒక వర్గం ప్రేక్షకులు ఈయనను ఓన్ చేసుకోవట్లేదు అనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ కారణాల వల్లే ఒక వర్గం ప్రేక్షకులు అలాగే ఒక మార్గం మీడియా కూడా  ఎన్టీఆర్ ను  పట్టించుకోవడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

•దీనికి తోడు ట్రైలర్ చూసిన చాలామంది ఇందులో కొరటాల శివ ఆచార్య నుంచి బయటకు రావట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

•ఆంధ్రావాలా సినిమాలో తండ్రి కొడుకులు గా ఎన్టీఆర్ నటించగా..  ఇప్పుడు అవే పాత్రలను మళ్ళీ ఇక్కడ చూపించేసరికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ ను  పిరికివాడిగా చూపించడం నచ్చలేదు. ఇలా పలు కారణాలు ఎన్టీఆర్ ట్రైలర్ ప్రజల్లోకి వెళ్లకపోవడానికి ప్రధానంగా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: