యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ , ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇకపోతే మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు 42 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సీడెడ్ మినహా ఏపీ లో ఈ మూవీ కి 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

ఇక సీడెడ్ మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 97 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఈ సినిమా దాదాపు సీడెడ్ కాకుండానే 100 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ స్థాయి కలెక్షన్లను వసూలు చేయాలి అంటే ఈ మూవీ కి కచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: