నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన విడుదల  అయ్యి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేకుండా దూసుకుపోతుంది. వర్షాలు కురుస్తున్న కూడా ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని పెద్ద మొత్తంలో లాభాలను కూడా అందుకుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్సాఫీస్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.53 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.60 కోట్లు , ఈస్ట్ లో 1.92 కోట్లు , వెస్ట్ లో 1.33 కోట్లు , గుంటూరులో 1.77 కోట్లు ,  కృష్ణ లో 1.76 కోట్లు ,  నెల్లూరు లో 1.16 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 28.67 కోట్ల షేర్ , 47.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 12 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 6.85 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 11.91 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 12 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 47.43 కోట్ల షేర్ , 87.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మన్ కంప్లీట్ చేసుకుని 5.43 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: