- ట్రైల‌ర్ రిలీజ్ కు ముందే యూఎస్ లో వ‌న్ మిలియ‌న్ కొట్టేసిన ఎన్టీఆర్‌
- కో స్టార్ రికార్డ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌తో బీట్ చేస్తాడా ?

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలువురు స్టార్ హీరోలు న‌టించిన భారీ మల్టీస్టారర్ సినిమాలలో ఇటీవల కాలంలో వరుస పెట్టి వస్తున్న పెద్ద ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ , బన్నీ పుష్ప 2 , ఎన్టీఆర్ దేవర , చిరంజీవి విశ్వంభ‌ర‌ సినిమాలు వరుస పెట్టి నాలుగు నెలలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.


దర్శక ధీరుడు ఎస్ఎస్ . రాజమౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 1200 కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెంచింది. ఈ సినిమా తర్వాత ఇద్దరు భారీ సినిమాలు సోలోగా చేస్తున్నారు. రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. వీటిలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర , చ‌ర‌ణ్‌ నటిస్తున్న గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా కంటే ఆలస్యంగానే స్టార్ట్ అయినా ముందే రిలీజ్ అవుతుంది.


ఇక దేవర ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే దేశవ్యాప్తంగా ఏ సినిమాకు సాధ్యం కానీ ఓ సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కు ముందే యుఎస్ మార్కెట్లో వన్ మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుని ఇతర హీరోలకు పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేసింది. మరి తన కో స్టార్ ఎన్టీఆర్ సెట్ చేసిన ఈ రికార్డును తారక్ తన గేమ్ చేంజ‌ర్‌ సినిమాతో బీట్ చేస్తాడా..లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ అయితే రామ్ చరణ్ కి బిగ్ సవాల్ విసిరాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: