విజయ్ తాజాగా ది గోట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో విజయ్ ఒక పాత్రలో తండ్రిగాను , మరొక పాత్రలో కొడుకు గాను నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ కి సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 5 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 120.15 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 21.95 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 11.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 15.20 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 124.55 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 148.60 కోట్ల షేర్ ... 303.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 38.40 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. ఈ సినిమాకు తమిళ నాడు , ఓవర్సీస్ లో మినహా ఏ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడం లేదు. ఈ రెండు ప్రాంతాల కలెక్షన్లతోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: