టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శ్రీ లీల రీసెంట్ గా చాలా సినిమాల్లో నటించే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. భగవాన్ కేసరి మూవీతో స్టార్ట్ చేసి ఎన్నో సినిమాల్లో నటించింది. మరి ఇప్పుడు క్రేజ్ మాత్రం తగ్గిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కథానాయకల్లో శ్రీలీల ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ తో కలిసి నటించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అందాల బామ శ్రీలీల ఆ తరువాత వరుస ఆఫర్స్ తో చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది.

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా, అత్యధిక పారితోషకాన్ని అందుకుంటూ కొనసాగిన ఈ క్యూట్ హీరోయిన్ హవా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తగ్గిందా? అంటే జాననే అంటున్నాయి సినీ వర్గాలు. మహేష్ బాబు తో నటించిన గుంటూరు కారం చిత్రం తరువాత శ్రీలీల నటించిన ఏ చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ భామ నితిన్ తో రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన చిత్రీకరణ సగం వరకు పూర్తయింది. ఇక దీనితో పాటు రవితేజ కొత్త చిత్రంలో కూడా హీరోయిన్గా ఎంపిక అయింది.

అయితే రవితేజ భుజానికి ఇటీవల శస్త్ర చికిత్స జరగటంతో ఈ సినిమా చిత్రీకరణ కూడా వాయిదా పడింది. మరో రెండు నెలల వరకు ఈ చిత్రం షూటింగ్ ప్రస్తావనే లేదు. ఇక వరుస షూటింగ్ లతో సందడి చేసిన శ్రీలీల ఇప్పుడు కాస్త విశ్రాంతి మూడ్ లో ఉంది. సినిమాల షూటింగ్లకు కూడా గ్యాప్ రావటంతో హాలిడేలను ఎంజాయ్ చేస్తుందట. అయితే ధమాకా మినహా శ్రీలీల పెరియార్ లో పెద్దగా చెప్పకోదగ్గ చిత్రం లేకపోవటంతోనే ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం ఈ వార్త నెట్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: